అన్నమయ్య జిల్లా డీఎంహెచ్వో సస్పెండ్

మదనపల్లి ఆగస్టు 14:( gtvmedia)అన్నమయ్య జిల్లా డీఎంహెచ్వో గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీనారాయణ నరసయ్యను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రెటరీ వీరపాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.
గత సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో అక్కడి వైద్యులు అక్రమంగా కిడ్నీ మార్పిడి చేస్తూ… ఓ మహిళ మృతికి కారణమైన విషయం తెలిసిందే.

అప్పట్లో డిఎంహెచ్ఓ నరసయ్య ఈ ఘటనపై విచారణలో ఉదాసీనతగా వ్యవహరించడంతో… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు.. ఈ క్రమంలో ఘటన జరిగిన పది నెలల తర్వాత డిఎంహెచ్ఓ నరసయ్య పై వేటుపడడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *