శాకాంబరీ అలంకరణలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి

శ్రీకాళహస్తి, ఆగస్టు 14: (gtvmedia)దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలతో శాకాంబరీ దేవి రూపంలో దివ్యంగా అలంకరించారు. శాకాంబరీ అలంకరణలో స్వామి, అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు.

ప్రత్యేక అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *