మదనపల్లె: (gtvmedia)మాదినికొండ ఫారెస్ట్‌లోని ఓ బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలపై తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

