మదనపల్లె: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బసినికొండలో గురువారం అర్ధరాత్రి బీహార్‌కు చెందిన యువకుడిపై స్థానిక యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
పెయింటింగ్ పనులు చేసుకుంటూ శాంతినికేతన్ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్న యువకుల వద్దకు వచ్చిన వ్యక్తితో వివాదం తలెత్తినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో **ఆకాష్ (23)**పై కత్తితో దాడి చేయడంతో శరీరంపై గాయాలయ్యాయి.
స్థానికుల సహాయంతో బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
