తిరుపతి, ఆగస్టు 13:( gtvmedia)జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత వాహన తనిఖీలు, ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించారు.

ప్రధాన రహదారులు, పట్టణాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్లలో వాహనాలను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఓపెన్ బీటింగ్, రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టారు.
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని జిల్లా పోలీస్ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలు వాహన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
