హిందువులకు వైఎస్ఆర్సిపి క్షమాపణలు చెప్పాలి

మదనపల్లె ఆగస్టు 11: (gtvmedia)రాష్ట్రంలోని హిందువులకు వైఎస్ఆర్సిపి నాయకులు క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… వైయస్సార్సీపి ఏ కార్యక్రమం చేపట్టిన టార్గెట్ ఒకటే హిందూ ధర్మాన్ని హిందూ దేవతలని అవమానించడం జరుగుతుంది అన్నారు.
తిరుమల శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేస్తూ తిరుమలేశుని హిందూ సమాజాన్ని అవమానించిన వైఎస్ఆర్సిపి మరియు జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు .
హిందూ దేవతలని, హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం, అవమానించడం, అపహస్యం చేయడం కాదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సిపి నాయకులకు ఎందుకు హిందూ మతం అన్న, హిందూ సమాజం అన్నా ఇంత ద్వేషము అనేది వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *