గుర్రంకొండ: (gtvmedia)పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం చెర్లోపల్లిలోని ఖానా కాయే గుల్షనే తాజుల్ ఫక్రియా దర్గాలో నిర్వహించిన ఉరుసు మహోత్సవంలో మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పాల్గొన్నారు.

ఆస్థాన గురువు సైఫ్ అలీ ఉసేనితో కలిసి ఎమ్మెల్యే ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను సందర్శించి ఉరుసు మహోత్సవ కార్యక్రమాలను పరిశీలించారు.
కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
