చేనేత కార్మికుల మధ్య కూర్చొని సమస్యలు విన్న సబ్‌ కలెక్టర్

అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ

మదనపల్లె, ఆగస్టు 10: (gtvmedia)కలెక్టరేట్ వద్ద ‘నేతన్న సేవలో’ పథకంపై ఆందోళన చేస్తున్న చేనేత కార్మికుల వద్దకు సబ్‌ కలెక్టర్ చల్లా కళ్యాణి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఆందోళనకారుల మధ్య రోడ్డుపై కూర్చున్న సబ్‌ కలెక్టర్.. చేనేత కార్మికుల సమస్యలను సావధానంగా విని వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన చేనేత కార్మికులు అర్జీలు సమర్పిస్తే, వాటిని పరిశీలించి మళ్లీ విచారణ జరిపి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అధికారి స్వయంగా ఆందోళనకారుల వద్దకు వచ్చి వారి మధ్య కూర్చొని సమస్యలను వినడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇవ్వడం పట్ల పలువురు “శభాష్ చల్లా కళ్యాణి” అంటూ అభినందించారు.

సబ్‌ కలెక్టర్ స్పందించిన తీరుపై స్థానికంగా కూడా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *