మదనపల్లె, ఆగస్టు 9: (gtvmedia)ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లెలోని జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మునిరత్నమయ్యను సభ్యులు ఘనంగా సన్మానించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ముని గోపాలకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ మునిరత్నమయ్యను రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల హక్కులకు సంబంధించిన అంశాలపై నిఘా ఉంచి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మునిరత్నమయ్య మాట్లాడుతూ తనను సన్మానించిన సీనియర్ సిటిజన్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసులు, తిమ్మయ్య, జగన్మోహన్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మునిరత్నమయ్య సేవలను వారు కొనియాడారు.
అలాగే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్, రాష్ట్ర రచయితల సంఘం ఉపాధ్యక్షుడు టీఎస్ఏ కృష్ణమూర్తి, గురువంక వార్డు మెంబర్ కృష్ణమూర్తి, రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి నారాయణస్వామి, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలువపల్లె కృష్ణమూర్తి, శ్రీధర్, కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో సభ్యులుగా చేరారు. అనంతరం డాక్టర్ మునిరత్నమయ్యను శాలువా, పూలమాల, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ గత నెల నివేదికను సమర్పించగా, ట్రెజరర్ కుమారస్వామి జమా ఖర్చుల వివరాలను వెల్లడించారు. తదుపరి సమావేశాన్ని 2026 సెప్టెంబర్ 13న నిర్వహించాలని నిర్ణయించారు. కార్యదర్శి కరుణాకర్ వందన సమర్పణ అనంతరం జాతీయ గీతంతో సమావేశం ముగిసింది.
