మదనపలల్లె ఆగస్టు 5 : (gtvmedia)అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు.

పీలేరు సమీపంలోని జంగంపల్లి వద్ద వన్‌వే నిబంధనలను అతిక్రమించిన టాటా ఇండికా కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో
బండి చలపతి (70) అక్కడికక్కడే మృతి చెందగా,
ఆయన భార్య సుబ్బులమ్మ (60) పీలేరుఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
మృతులు సదుం మండలం బొమ్మిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన దంపతులుగా గుర్తించారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
