టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి. DEO: సుబ్రహ్మణ్యంమదనపల్లి ఆగస్టు 5: (gtvmedia)2026 27 విద్యా సంవత్సరం టెన్త్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని డిఈఓ కే సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో డీఈఓ సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణత చెందే విధంగా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని, సి, డి గ్రేడ్లు ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించాలని, అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలను ఇన్స్పైర్లో ఎక్కువ మందిని పాల్గొనేటట్లు, ప్రాజెక్టులు తయారు చేసి సంసిద్ధత చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మనం- వనం కార్యక్రమం గురించి ప్రధానోపాధ్యాయుల వారికి సూచనలు ఇచ్చారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులను ఉపాధ్యాయులను మొక్కలు నాటే మనం వనం ప్రోగ్రాం యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడాలని, ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అటవీశాఖ అధికారుల సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఇబి కార్యదర్శి గంగాధరం, జిల్లా సైన్సు అధికారి జి శ్రీధర్ కుమార్, రాయచోటి డైట్ ఇన్చార్జి లెక్చరర్ నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *