మదనపల్లె, ఆగస్టు 3: (gtvmedia)ఆర్టీసీని ప్రైవేటీకరించే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నాయకులు సోమవారం ఇన్చార్జి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రజలకు అత్యంత కీలకమైన ప్రజారవాణా సంస్థ అని, దానిని ప్రైవేటీకరించడం వల్ల ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు సీఏ బాబు, వినోద్, భయ్యా రెడ్డి, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
