మదనపల్లె పట్టణం నవంబర్ 13: మదనపల్లి పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం కాంప్లెక్స్‌లో స్కై లేబన్ నూతన బ్రాంచ్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు.
స్కై లేబన్ బ్రాంచెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ షాజహాన్ భాషా గారు, యువ నాయకులు శ్రీ జునైద్ అక్బరి గారు పాల్గొన్నారు.
మదనపల్లిలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన స్కై లేబన్ బ్రాంచ్‌ను ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారు, జునైద్ అక్బరి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్కై లేబన్ ప్రతినిధులు, నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
