మదనపల్లి నవంబర్ 12 : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం బెంగళూరుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజును కలసిన చినబాబు మర్యాదపూర్వకంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అదేవిధంగా ఎస్బిఆర్ గ్రూప్ చైర్మన్ తంగాల వేణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా చిన్న బాబు కలిసి, రాజకీయ అంశాలపై చర్చించారు
డిప్యూటీ స్పీకర్ ని కలసిన మున్సిపల్ చైర్మన్ చినబాబు
