మదనపల్లె, నవంబర్ 11:
విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆదేశాలతో రాయచోటి, మదనపల్లె పట్టణాల్లోని విద్యాసంస్థల పరిసరాల్లో పోలీసులు డ్రోన్ నిఘా, ‘శక్తి టీమ్స్’తో గస్తీ ముమ్మరం చేశారు.
పాఠశాలలు, కళాశాలల ప్రారంభ, ముగింపు సమయాల్లో ఆకతాయిలు, ఈవ్‌టీజర్ల ఆగడాలను అరికట్టేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు డేగకన్నుతో పర్యవేక్షిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించి విద్యార్థినులను వేధించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వేధింపులకు గురైతే వెంటనే ‘డయల్ 100/112’ను సంప్రదించాలని, బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు.
