వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్లతో విశేష స్పందన – ఆవిష్కరణలు, సాంకేతిక ప్రతిభకు వేదికగా డీఫెస్టా-26
మదనపల్లె, సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్) విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ‘DFESTA-26’ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల విద్యార్థుల నుంచి వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్లు రావడం ఈ సదస్సుకు లభించిన విశేష స్పందనను తెలియజేసింది. సాంకేతిక ఆవిష్కరణలకు, యువ ప్రతిభకు వేదికగా నిలిచిన ఈ సదస్సుకు బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ సెలెబల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సబరినాథన్ సంపత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం లో భాగంగా ముఖ్య అతిథి తో పాటు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డీన్ డాక్టర్ సి. పి. గుప్తా, డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. కుసుమ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. నిర్మలా దేవి లు జ్యోతి ప్రజ్వణతో ప్రారంభించారు . పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ఆధునిక సాంకేతిక పరిణామాలను నిరంతరం తెలుసుకోవడం, ఆచరణాత్మక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్య అతిథి భాగస్వామ్యంతో విద్యార్థులకు ఐటీ రంగంలోని వృత్తిపరమైన అవకాశాలు, పరిశ్రమల అంచనాలు, ఆధునిక సాంకేతిక ధోరణులపై అవగాహన పొందే అవకాశం లభించింది. నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (AI), డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల పనితీరును విప్లవాత్మకంగా మారుస్తున్నాయని బెంగళూరుకు చెందిన సెలెబల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సబరినాథన్ సంపత్ పేర్కొన్నారు. యువతలో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం, పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభకు జాతీయ స్థాయి వేదికగా నిలిచింది అని అన్నారు. తరగతి గది పరిజ్ఞానాన్ని వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారానికి అన్వయించే దిశగా విద్యార్థులకు విలువైన అనుభవాన్ని ఈ కార్యక్రమం అందించిందన్నారు. సాంకేతిక విద్య కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఆయనఅన్నారం.
ఈ సింపోజియంలో భాగంగా నిర్వహించిన కోడ్ క్లాష్ (Code Clash), ప్రాజెక్ట్ ఎక్స్పో (Project Expo), టెక్ విజన్ (Tech Vision), ఇన్నోవెక్స్ (Innovex), టెక్ క్విజ్ (Tech Quiz), వెబ్ విజార్డ్ (Web Wizard), డేటా డిబేట్ (Data Debate), బగ్ బస్టర్స్ (Bug Busters) వంటి వైవిధ్యభరిత సాంకేతిక పోటీలు విద్యార్థులలోని సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, ప్రోగ్రామింగ్ సామర్థ్యం, సమస్యల పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశాన్ని కల్పించాయి అని ప్రిన్సిపాల్ డాక్టర్ పీ. రామనాథం అన్నారు,


