మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని ఎన్సీసీ విభాగానికి చెందిన ఐదుగురు క్యాడెట్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో గల భలుక్పాంగ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (NIMAS) ఆక్వా ఎక్సలెన్స్ సెంటర్లో వారం రోజుల పాటు నిర్వహించిన వైట్ వాటర్ రాఫ్టింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొని ప్రతిభ చూపారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. ఈ శిబిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మొత్తం 100 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారని , మిట్స్ తరఫున సీనియర్ అండర్ ఆఫీసర్ (SUO) వంశీ కృష్ణ, క్యాడెట్లు శ్వేత, నీరజ, రెడ్డి తేజ, రాకేష్ నాయక్ లు పాల్గొన్నారని తెలిపారు. ఈ శిబిరంలో భాగంగా ప్రకృతి అందాల పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్, నదీ ప్రవాహాల్లో వైట్ వాటర్ రాఫ్టింగ్ వంటి సాహసోపేత కార్యక్రమాలను అనుభవజ్ఞులైన ట్రైనర్లు యోగేష్, విపిన్ సింగ్, రాజేంద్ర సింగ్ రావత్ పర్యవేక్షణలో క్యాడెట్లకు రాఫ్టింగ్పై ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా క్యాడెట్లు ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించుకున్నారని తెలిపారు. ఈ శిబిరంలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న క్యాడెట్లను పాల్గొన్న మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల మరియు అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ తదితరులు అభినందించారు.


