కరువు మండలాల ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం— సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఎ.రామానాయుడు

మదనపల్లె, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వర్షాభావ, కరువు ప్రభావిత మండలాలను వెంటనే ప్రకటించి అన్నమయ్య జిల్లాను పూర్తిగా కరువు జిల్లాగా ప్రకటించాలని
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రామానాయుడు మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థుల ఫీజులను మాఫీ చేసి, చదువులు మధ్యలో ఆగకుండా ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం, దాణా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు..
అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ అన్ని స్థానాలకు పోటీ చేయడానికి సిద్ధమైనట్లు దానితోపాటు మదనపల్లె చైర్మన్ స్థానానికి కూడా సిపిఐ పోటీ చేస్తుందని సమావేశంలో తీర్మానించడం జరిగిందని తెలిపారు
. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ కార్యవర్గ సభ్యులు సుమిత్రమ్మ, మనోహర్ రెడ్డి, మురళి, కోటేశ్వరరావు, సమితి సభ్యులు రంగారెడ్డి, రఘునాథ్ అష్రఫ్ అలీ, జక్కల వెంకటేష్, మాధవ కుమార్, తిరుమల దేవా అంజన్నప, రామ్మూర్తి శ్రీనివాస్ గౌడ్ హరి రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *