అమరుల త్యాగాలు చిరస్మరణీయం

మదనపల్లెలో ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

మదనపల్లె, అక్టోబర్ 31: శాంతిభద్రతల పరిరక్షణలో, సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. ‘పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు’ ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం మదనపల్లె పట్టణంలో జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ కళాశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన (క్యాండిల్ ర్యాలీ) నిర్వహించి అమరులకు భావోద్వేగ భరితంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ…. ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో అత్యున్నత ప్రాణత్యాగం చేసిన పోలీసు వీరుల సేవలను స్మరించుకోవడం మనందరి కనీస బాధ్యత. వారి త్యాగస్ఫూర్తి ప్రతి పోలీసు అధికారికి, సమాజానికి ఆదర్శప్రాయం” అని కొనియాడారు..

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటాద్రి , మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్, పట్టణ, రూరల్ సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో సివిల్, ఏఆర్ పోలీసు సిబ్బంది, ప్రత్యేక పోలీసు బలగాలు మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *