మదనపల్లి అక్టోబర్ 31: మదనపల్లెలోని 48 వార్డులు, ఒక చైర్మన్ స్థానానికి, పుంగనూరులో నాలుగు వార్డులకు నిర్వహించే మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. శనివారం మదనపల్లి జడ్పీ హైస్కూల్లో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులకు సూచనలు ఇచ్చారు.
నవంబర్ 1న మదనపల్లె లో48 వార్డులు, పుంగనూరు లో 4 వార్డుల మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు.
మదనపల్లెలో శనివారం జెడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్స్, పెన్నులు, నిషేధిత వస్తువులకు అనుమతి లేదని, 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించారు.
అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి గారు, డీఎస్పీలు బి.ప్రసాద్, ఎం.ఆర్.కృష్ణమోహన్, డి.ఏడుకొండల రెడ్డి, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

