మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో ముఖ్య ప్రకటన.

నవంబర్ 1వ తేదీన ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించబోయే ప్రభుత్వ ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ కీలక ప్రకటన చేశారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోకుండా వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.

అర్హులైన ఉద్యోగులు, మదనపల్లె పురపాలక సంఘంలో ఓటు ఉన్నవారు, రేపు అంటే 28.10.2026 బుధవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మదనపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్ (Z.P. High School) లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును వేయవచ్చు.

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత సమయంలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. సంబంధిత అధికారులు, సిబ్బంది సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *