మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో చైర్మన్ అభ్యర్థి చినబాబు నివాసంలో కూటమి నేతల సమావేశం
మదనపల్లె: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మదనపల్లెలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు) నివాసంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కూటమి నాయకులు ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జి గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లె ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్, జనసేన నాయకులు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, గుండాల రామచంద్ర, కంచర్ల చింటు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతల మధ్య జరిగిన ఈ భేటీలో ఎన్నికల కార్యాచరణ, ప్రచార వ్యూహాలు, నాయకుల సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికల్లో సమష్టిగా ముందుకు సాగుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంపై నాయకులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మదనపల్లె మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి ముఖ్య నాయకుల సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

