మదనపల్లి: సంస్కృత సాహిత్యంలో తొలి మహాకావ్యమైన రామాయణాన్ని రచించి, ఆదికవిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ కూడలిలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి జీవితాన్ని, ఆయన రచించిన రామాయణంలోని ఆదర్శాలను స్మరించుకున్నారు. సమాజానికి ధర్మం, న్యాయం, మానవీయ విలువలను చాటిచెప్పిన వాల్మీకి మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వాల్మీకి సంఘం ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
