మదనపల్లెలో ఆధునిక హంగులతో సునీల్ థియేటర్ రెన్యువేషన్

మదనపల్లె: సెప్టెంబర్ 24:పట్టణంలోని సునీల్ థియేటర్‌ను ఆధునిక హంగులతో నూతనంగా రెన్యువేషన్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ థియేటర్ రాజా ఆహ్వానం మేరకు మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా థియేటర్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా థియేటర్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా థియేటర్‌ను తీర్చిదిద్దిన నిర్వాహకులను అభినందించారు.

మదనపల్లె పట్టణంలో వినోద రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఆధునికంగా అభివృద్ధి చెందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *