మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డులో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, మదనపల్లె పట్టణ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను బలపరచాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే షాజహాన్ భాషా కూటమి అభ్యర్థుల విజయానికి పూర్తి సహకారం అందిస్తూ ప్రచారంలో చురుకుగా పాల్గొంటుండగా, చైర్మన్ అభ్యర్థి చినబాబు కూడా కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రజల మద్దతు కోరుతున్నారు.
స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్న ఈ ప్రచార కార్యక్రమంలో 12వ వార్డు అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


#Madanapalle #MLAShajahanBasha #Chinababu #TDP #Ward12 #AllianceCampaign
