మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో బి.టెక్ విద్యార్థులకు సెక్యూర్ కోడింగ్‌పై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ సీఎస్ఈ 2015–2019 బ్యాచ్ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం బెంగళూరులోని Q2 సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్-2 (SDE-2)గా పనిచేస్తున్న కె. పూర్ణ చంద్ర రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్‌ను సురక్షితంగా రూపొందించడంలో సెక్యూర్ కోడింగ్ ఎంతో ముఖ్యమని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను ముందుగానే గుర్తించి, వాటిని సరిచేయడం ద్వారా వినియోగదారుల సమాచారాన్ని, సాఫ్ట్వేర్ వ్యవస్థలను రక్షించవచ్చని అన్నారు. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తే సమస్యలు, అనుమతుల నియంత్రణలో లోపాలు, సమాచార రక్షణలో సమస్యలు, హానికరమైన ఇన్పుట్ల ద్వారా జరిగే దాడులు, సాఫ్ట్వేర్ రూపకల్పనలోని లోపాలు వంటి ఐదు ప్రధాన భద్రతా సమస్యలను ఉదాహరణలతో వివరించారు. విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించడం, వాటిని పరీక్షించడం, సరిచేయడం, పరిష్కారాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడం వంటి అంశాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాలని తెలిపారు. ఇందుకోసం “గెస్ – ట్రై – ఫిక్స్ – ప్రూవ్” (ఊహించు – ప్రయత్నించు – సరిదిద్దు – నిర్ధారించు) అనే విధానాన్ని వివరించారు. విద్యార్థులు కోడింగ్‌పై పట్టు సాధించడంతో పాటు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మొదటి దశ నుంచే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, సెక్యూర్ కోడింగ్ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. సాఫ్ట్వేర్ డెవలపర్, సెక్యూరిటీ ఇంజనీర్, అప్లికేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, పెనెట్రేషన్ టెస్టర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వంటి ఉద్యోగాల్లో రాణించేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు . కోడింగ్, సమస్యల పరిష్కారం, సాఫ్ట్వేర్ భద్రత, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పట్టు సాధించి, ఇంటర్న్‌షిప్‌లు మరియు ప్రాజెక్టుల ద్వారా అనుభవాన్ని పొందాలని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ బ్రహ్మ ప్రకాష్,డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్. గుప్తా, కోఆర్డినేటర్ ఎ. కోమల, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగాశ్వేత, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


