మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

మదనపల్లె: (gtvmedia)

మానవత సంస్థ సెంట్రల్ కమిటీ కన్వీనర్ సి. భాస్కర రెడ్డి గారి మనవడు బృంద విహారి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మధ్యాహ్నం మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యశాల ఆర్‌.ఎమ్‌.ఓ. డాక్టర్ రాధిక గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక గారు మాట్లాడుతూ… మానవత సంస్థ మదనపల్లెలో అందిస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాలను కొనియాడారు.

పాల్గొన్న ముఖ్యులు:

ఈ అన్నదాన కార్యక్రమంలో మానవత సంస్థ సభ్యులు హరినాథ్ బాబు, ఎమ్.వి.రెడ్డి, శంకరప్ప నాయుడు, రామచంద్ర రెడ్డి, వెంకట శివ, రెడ్డెప్ప, లక్ష్మి రెడ్డి, వెంకటరమణ, చెంగల్ రెడ్డి, చలపతి, శివశంకర్ రెడ్డి, ద్వారక నాథ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *