మదనపల్లి కలెక్టరేట్‌లో అన్ని పార్టీలకు ఓటర్ ముసాయిదా జాబితాల పంపిణీ

మదనపల్లి, జూలై 31: (gtvmedia)భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలను శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా ఎన్నికల అధికారులు అందజేశారు.

ఈ సందర్భంగా అధికారులు ముసాయిదా జాబితాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు చేర్చడం, అనర్హుల పేర్లు తొలగించడం, వివరాల్లో సవరణలు చేయించడం వంటి అంశాలపై నిర్ణీత గడువులోగా దరఖాస్తులు, అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు మరియు ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *