మదనపల్లె అక్టోబర్ 17: మదనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థుల నామినేషన్ వద్ద స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. స్థానిక దొంతి వీధిలో నామినేషన్ కేంద్రం వద్ద, టిడిపి చైర్పర్సన్ అభ్యర్థి శ్రీ రామ్ చిన్నబాబు, వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థి జింక వెంకటా చలపతి లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని షేక్ హాండ్లు ఇచ్చుకుని నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీలు వేరైనా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకుందామని కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని ఇద్దరు అభ్యర్థులు కోరారు. అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు రాయచోటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా దాడులు ప్రతిదాడులు జరిగి పలువురికి రక్త గాయాలైన సందర్భంగా.. మదనపల్లిలో మాత్రం శాంతియుతంగా నామినేషన్లు జరగడం గమనార్హం.
టిడిపి, వైసిపి అభ్యర్థుల షేక్ హ్యాండ్లు
