మదనపల్లె, అక్టోబర్ 17: మదనపల్లె లోని దొంతి వీధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు.
డీఎస్పీ వంశీధర్ గౌడ్, రెండవ పట్టణ సీఐ గోపాల్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డిల పర్యవేక్షణలో కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ కేంద్రం, పరిసర ప్రాంతాలపై అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచారు.
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నామినేషన్ల ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని డీఐజీ అధికారులను ఆదేశించారు.
