స్పెషల్ టెట్ పరీక్ష ప్రారంభం

మదనపల్లె అక్టోబర్ 11 : అన్నమయ్య జిల్లాలో స్పెషల్ టెట్ పరీక్ష లో ఆదివారం ప్రారంభమయ్యాయి. మదనపల్లె లోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల రాయచోటి లోని రెండు కేంద్రాల్లో స్పెషల్ టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
SCERT రూపొందించిన ప్రశ్నలతో స్పెషల్ TET ప్రశ్నపత్రం సులువుగా ఉందని పలువురు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈరోజు నిర్వహించిన టెట్ పరీక్ష ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన స్పెషల్ TET పరీక్షలో భాగంగా మార్నింగ్ సెషన్‌లో పరీక్ష రాసిన ఉపాధ్యాయులు ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలో SCERT రూపొందించిన ప్రశ్నలకు అనుగుణంగా సుమారు 99% ప్రశ్నలు వచ్చాయని పలువురు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దీంతో పరీక్ష రాసిన ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నెలకొన్నాయి.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్పెషల్ TET పరీక్షను సమర్థవంతంగా రాసిన ఉపాధ్యాయులందరికీ మంచి ఫలితాలు రావాలని, వారందరూ విజయపథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మదనపల్లి మండలం హెడ్ పరీక్ష కేంద్రం వద్ద డీఈఓ సుబ్రహ్మణ్యం ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి పరిశీలించి సౌకర్యాలను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *