మదనపల్లిలో కొనసాగుతున్న ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం ఎం.షాజహాన్ బాషా

మదనపల్లె, జూలై 30: (gtvmedia)మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ, 6వ వార్డుల్లో గురువారం ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానికులు మాట్లాడుతూ, ‘తల్లికి వందనం’, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా తమ కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు **న్ విద్యాసాగర్, నవీన్ చౌదరి గంగారపు ,వైఎస్ మునిరత్నం, ఎన్సీ నంద కుమార్ ,నాదెళ్ల శివ, భావన, రత్నమ్మ, సహదేవ నాయుడు, బాబ్జీ, **, వార్డ్ ఇన్‌చార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *