బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా వికాసిత్ భారత్ సంకల్ప సభఅన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో వికసిద్భారత్ సంకల్ప సభ విజయవంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా అక్టోబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్ సంకల్ప సభను నిర్వహించడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈరోజు వరకు సెలవు అనేది తీసుకోకుండా నిరంతరం దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. సమావేశ అనంతరం బిజెపి కార్యకర్తలు మద్దతుదారులందరూ టౌన్ హాల్ నుండి అన్నమయ్య సర్కిల్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి ప్రశాంత్ విజయభారతి విద్యాసంస్థల అధినేత సేతు జిల్లా జనరల్ సెక్రెటరీలు గోల్డెన్ వాలి రమణారెడ్డి మదన్మోహన్ భువనేశ్వరి సత్య రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పురుషోత్తం బిజెపి నాయకులు కృష్ణ చైతన్య నవీన్ శ్రీకాంత్ సాంబశివ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *