మదనపల్లె, అక్టోబర్ 2: మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా, యువ నాయకులు జునైద్ అక్బరి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మదనపల్లి ప్రాంతంలో ఉద్యానవన రంగం అభివృద్ధి, రైతులకు మౌలిక వసతులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
