మదనపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

మదనపల్లె, అక్టోబర్ 1:
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొననున్న కార్యక్రమాల నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

బీకే పల్లి బైపాస్ సమీపంలోని చంద్ర కాలనీలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ పరిశీలించారు.

రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్, ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబులి, జాయింట్ కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ఇతర సదుపాయాలను పరిశీలించారు.

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులతో చర్చించారు. కార్యక్రమాలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *