మదనపల్లి జూలై 29 : (gtvmedia)విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆకాంక్షించారు. బుదవారం సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ లో ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆద్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తో పాటూ పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్.సేతు, బిజేపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ళ విధ్యాసాగర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర రెడ్డి, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, షంషీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ
తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని, తమ పిల్లల గురించి తల్లి గొప్పగా చెప్పుకుంటారని, దానికి తగ్గట్టుగా విద్యార్థులు కూడా తల్లిదండ్రుల పట్ల అదే గౌరవంతో తోటి మనుషుల పట్ల ప్రేమగా ఉంటూ ఒకరికొకరు సహాయం అందించాలన్నారు. లక్షలు సంపాదించడం ముఖ్యం కాదని, తోటి వారికి సహాయం చెయ్యడం గొప్ప అని, పరోపకారం చేసిన వారికి భగవంతుడు మరికొంత వృద్దిలోకి రావడానికి దేవుడు సహాయం అందిస్తాడన్నారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్. సేతు విద్యార్థుల పట్ల చూపుతున్న ఆదరణ ప్రేమ వెలకట్టలేనిదని, విద్యతో పాటూ విలువలను పాటిస్తూ సంస్కృతి సంప్రదాయాల ను పెంపొందిస్తూ పాఠశాల నడపడం గొప్పతనం అని కీర్తించారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి వృద్దిలోకి రావాలని ఆకాంక్షించారు. అదే విధంగా పాఠశాల ఎన్నికల్లో గెలచిన విద్యార్థులు రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి దోహదపడాలని కోరారు. ప్రిన్సిపల్ నిశ్చిత సేతు మాట్లాడుతూ జీవితం మొత్తం గురువులతో ముడిపడి ఉంటుందని పుట్టగానే తల్లిదండ్రుల రూపంలో, ఉద్యోగాల్లో స్థిరపడేదాకా పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ స్థాయిల్లో గురువులుగా మనకు జీవితాంతం గురువులు తోడుగా ఉంటారన్నారు. గురు పౌర్ణమిని వేద వ్యాసుడు, మహా శివుడు సప్త రుషులకు జ్ణానం పంచిన రోజున జరుపుకుంటున్నామని, ప్రతి రోజు తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు తీసుకునే విద్యార్థులు ఉన్నత శిఖారాలను అధిరోహిస్తారని స్పష్టం చేశారు. అనంతరం తామంతా గొప్ప గురువుగా భావించే డాక్టర్ ఎన్. సేతు దంపతులకు పాఠశాల సిబ్బంది దుశ్సాలువ కప్పి గజమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలి
