అన్నమయ్య జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలుమదనపల్లె, సెప్టెంబర్ 29:అన్నమయ్య జిల్లాలో పాఠశాల యాజమాన్య కమిటీ (School Management Committee – SMC) ఎన్నికలు మంగళవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించినట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు.

జిల్లాలో మొత్తం *l1,792 పాఠశాలలు ఉండగా, అందుల 1,768 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించబడ్డాయి.

సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎన్. అనురాధ మదనపల్లె మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్, బసినికొండ పాఠశాలలో నిర్వహించిన SMC ఎన్నికల్లో స్వయంగా పాల్గొని ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు మరియు సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో SMCలు కీలక పాత్ర పోషిస్తాయని, ఎన్నికల ద్వారా ఏర్పడిన కమిటీలు పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం మరియు పాఠశాల–సమాజ అనుసంధానానికి మరింత చురుకుగా పనిచేయాలని APC ఆకాంక్షించారు.

జిల్లావ్యాప్తంగా SMC ఎన్నికల నిర్వహణకు సహకరించిన MEOలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు ప్రజాప్రతినిధులక సమగ్రశిక్ష జిల్లా అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *