తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఉచిత దర్శనానికి 20–24 గంటల సమయం.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3–5 గంటలు

తిరుమల, సెప్టెంబర్ 27: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 82,181
తలనీలాలు సమర్పించిన భక్తులు: 37,633
హుండీ ఆదాయం: ₹3.94 కోట్లు
విక్రయించిన లడ్డూలు: 4.89 లక్షలు
అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు: 2.82 లక్షలు
వైద్య చికిత్స పొందిన భక్తులు: 3,893

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *