సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు.. సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లె,సెప్టెంబర్ 26:అక్టోబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో సభాస్థలిని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పరిశీలించారు.

సీఎం పర్యటనకు సంబంధించి సభా ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలన చేపట్టారు. కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు సీఎం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్లు పెందుర్తి వెంకటేష్‌తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *