వంకలు కాలవల ఆక్రమణలు పట్టించుకోండిమదనపల్లె, సెప్టెంబర్ 24:అక్రమ ఆక్రమణలతో మదనపల్లె కాలువలు, వంకలు మూసుకుపోతున్నాయి – సర్వేలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంమదనపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో బహుదా కాలువలు, సాగునీటి కాలువలు, చెరువుల వంకలు అక్రమంగా ఆక్రమించడంతో పాటు, వాటిలో వ్యర్థాలను డంపింగ్ చేసి మట్టితో ఫిల్లింగ్ చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూఈ సమస్యపై మున్సిపల్ కార్యాలయం మరియు ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదులు చేయగా, సమస్య పరిష్కారం కోసం మదనపల్లె మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఇరిగేషన్ శాఖకు ఎండార్స్‌మెంట్, అనంతరం ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖకు ఎండార్స్‌మెంట్ చేసి, సంబంధిత కాలువలు, సాగునీటి కాలువలు, చెరువుల వంకలను సర్వే చేసి ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయో గుర్తించాలని కోరిందన్నారు.అయితే రెవెన్యూ శాఖకు ఎండార్స్‌మెంట్ ఇచ్చి దాదాపు రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు సర్వే నిర్వహించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని పునీత్ కుమార్ విమర్శించారు.కాలువలు, వంకలు ఆక్రమణలకు గురికావడం వల్ల హంద్రీ-నీవా నీరు సాగునీటి కాలువలకు, చెరువులకు సక్రమంగా చేరకుండా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.తక్షణమే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి, ఆక్రమణల పూర్తి వివరాలను గుర్తించి, సంబంధిత శాఖలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన డిమాండ్ చేస్తోంది అని పునీత్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *