మదనపల్లె, సెప్టెంబర్ 24 : డ్రగ్స్ నిర్మూలన, ఎన్.డి.పీ.ఎస్ కేసుల్లో విశేష సేవలందించిన జిల్లా ‘ఈగల్ సెల్’ సభ్యుడు పి. శ్రీనివాసులుకు రాష్ట్రస్థాయిలో ప్రతిష్ఠాత్మక “ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు” దక్కింది.
విజయవాడలో ఈగల్ ఐజీపీ ఆకే. రవికృష్ణ సమక్షంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా శ్రీనివాసులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
అవార్డు సాధించి జిల్లా పోలీసు శాఖకు పేరు తెచ్చిన ఆయనను బుధవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతి పోలీసు అధికారి శ్రీనివాసులును స్ఫూర్తిగా తీసుకొని, జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
