మదనపల్లె: మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగం, CDSL సహకారంతో MBA విద్యార్థులకు “భారతీయ ఆర్థిక మార్కెట్లపై అవగాహన మరియు అవకాశాలు” అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించింది.


ముఖ్య అతిథి, సెక్యూరిటీస్ మార్కెట్ ట్రైనర్ డాక్టర్ జె. మూర్తి మాట్లాడుతూ ఆర్థిక మార్కెట్లు దేశ ఆర్థిక వృద్ధికి కీలకమని, పెట్టుబడులకు ముందు మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడి సాధనాలు, రిస్క్‌లపై అవగాహన అవసరమని తెలిపారు. ఆర్థిక రంగంపై అవగాహనతో బ్యాంకింగ్, ఫైనాన్స్, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సేవల రంగాల్లో కెరీర్ అవకాశాలను విద్యార్థులు గుర్తించవచ్చన్నారు.
కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ డాక్టర్ భాను శ్రీరెడ్డి, డాక్టర్ ఎన్. గంగిశెట్టి, కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. జ్ఞానప్రసూన, అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. శ్రీకాంత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
