మదనపల్లె, సెప్టెంబర్ 18: కరువు సీమకు కృష్ణా జలాలు చేరుతున్న సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ నెల 19వ తేదీ, శనివారం ఉదయం 11 గంటలకు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద కృష్ణా జలాలకు స్వాగతం పలుకుతూ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మదనపల్లె నియోజకవర్గ కూటమి నాయకులు తెలిపారు.
కృష్ణా జలాలను తీసుకువచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
ఈ కార్యక్రమానికి మదనపల్లె నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు.
