జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎల్ రాధిక
మదనపల్లె సెప్టెంబర్ 18: హెచ్ఐవి / ఎయిడ్స్ పై యువత అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ ఎల్ రాధిక, దిశా ఉమ్మడి జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ వేంపల్లి భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి డి ఎం హెచ్ ఓ కార్యాలయం వద్ద ఏపీ సాక్స్ ఆదేశాల మేరకు దిశా ఆధ్వర్యంలో 5 కె మారతాన్ ర్యాలీని డాక్టర్ రాధిక జెండా ఊపి ప్రారంభించారు. హెచ్ఐవి పై అవగాహన పెంచుదాం.. వివక్షను తరిమికొడదాం.. అనే నినాదంతో యువతి యువకులు ఉత్సాహంగా పరుగులు తీస్తూ ప్రజల్లోకి బలమైన సందేశాన్ని తీసుకెళ్లారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారిని మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా యువతలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ఐసిటిసి కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
5 కే రన్ లో విజేతలు :
5 కే రన్ లో పురుషుల విభాగంలో మొదటి స్థానం జ్ఞానంబికా డిగ్రీ కాలేజ్‌కు చెందిన విద్యార్థి టి. ధనప్రసాద్, ద్వితీయ బహుమతి జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థి సి సతీష్ దక్కించుకున్నారు.. స్త్రీల విభాగంలో మొదటి బహుమతి ఏ మహేశ్వరి, ఫైనల్ ఇయర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ద్వితీయ బహుమతి కే పూజ, సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాల పీలేరు దక్కించుకున్నారు. విజేతలకు మొదటి బహుమతి కింద రూ. 10 వేలు, ద్వితీయ బహుమతి కింద రూ. 7 వేలు అంద చేయనున్నట్లు తెలిపారు. విజేతలు ఈనెల 29న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను డాక్టర్ రాధిక, వేంపల్లి భాస్కర్ అందజేశారు. కార్యక్రమంలో ఏ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ హుమయున్ భాష, ఆర్ఆర్ఎస్ డైరెక్టర్ జయన్న, సిపిఓ ఆనంద్, ఎస్ టి ఐ కౌన్సిలర్ పుల్లయ్య నాయుడు.
