మదనపల్లె, సెప్టెంబర్ 17:
మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితుడిని మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మచెరువుమిట్ట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న **పూజారి మహేష్ (26)**ను అదుపులోకి తీసుకుని విచారించారు.
తనకల్లు మండలం, సత్యసాయి జిల్లా దండువారిపల్లెకు చెందిన మహేష్ అప్పుల కారణంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి 12.150 గ్రాముల బంగారు చైన్, 19 గ్రాముల వన్‌గ్రామ్ గోల్డ్ చైన్, చైన్లను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.1.90 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన AP40-LM-4176 హీరో డెస్టినీ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో మదనపల్లె వన్‌టౌన్ పరిధిలో రెండు కేసులు, బి.కొత్తకోట పరిధిలో ఒక కేసులో మహేష్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. జోగప్పగారి వీధి, పీ&టీ కాలనీ, బురకాయలకోట ప్రాంతాల్లో మహిళల నుంచి చైన్లు లాక్కెళ్లిన ఘటనల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
