డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు

మదనపల్లె సెప్టెంబర్ 15: డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అని నీవు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద డిసిఇబి ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ విద్యాలయ,”డ్రగ్స్ వద్దు బ్రో ” పాఠశాల స్థాయి కార్యక్రమాలను తెలియజేసే పుస్తకావిష్కరణ ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కే సుబ్రహ్మణ్యం ఆవిష్కరణ చేశారు. DCEB సెక్రటరీ గంగాధరం, ఎంఈఓ లు శ రెడ్డి శేఖర్ ,సురేంద్రబాబు , త్యాగరాజు , రెడ్డేన్నశెట్టి, ప్రధానోపాధ్యాయులు చంద్ర శేఖర్, మహేష్ నారాయణ, శ్రీదేవి, మోహన్, ఏపీఓ భాస్కరన్ ,డిఎస్ఒ శ్రీధర్ పాల్గొనారు. విద్యార్థులు పొగాకు ఉత్పత్తులు, డ్రగ్స్ సంబంధిత పదార్థాలను సేవించడం ద్వారా ఆరోగ్యం మరియు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని క్రమశిక్షణ మరియు మంచి అలవాట్లు ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని డిఈఓ తెలియజేశారు. పాఠశాలకు 100 మీటర్లు పరిధిలో ఎటువంటి పొగాకు ఉత్పత్తులు మత్తు పదార్థాలను విక్రయించరాదని అలాగే పిల్లలకు ఇవ్వరాదని అలా ఇవ్వడం చట్ట ప్రకారం నేరo అని అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *