మదనపల్లె రూరల్, సెప్టెంబర్ 15: మదనపల్లె రూరల్ మండలం బెంగళూరు రోడ్డు పరిధిలోని నక్కలదిన్నె పప్పిరెడ్డిపల్లెలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.


NPS కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మదనపల్లె AMC చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి అన్నమయ్య–చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మదనపల్లె రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, AMC డైరెక్టర్ గెడ్డం లక్ష్మీపతి, వేంపల్లి సువారపు చంద్రశేఖర్, జనసేన PTM హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
