నూతన మస్జిద్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపల్లె,సెప్టెంబర్ 13:మదనపల్లి బైపాస్‌ బి.కె.పల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన మస్జిద్‌ముకదస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషా పాల్గొన్నారు.

మైనార్టీ సోదరులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మస్జిద్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మస్జిద్‌ నిర్వాహకులు, స్థానిక మైనార్టీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

మత సామరస్యం, పరస్పర సోదరభావం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *