రామసముద్రం సెప్టెంబర్ 11 : అగ్నిప్రమాదంలో కాలిన మూడు లోడ్ల వరి గడ్డి మేటలు కాలి బూడిద అయ్యాయి.
మండల పరిధిలోని కాపల్లి పంచాయతీ గజ్జలవారిపల్లి గ్రామంలో రైతు జి. సుబ్రహ్మణ్యం తన పాడి ఆవుల మేత కోసం ఐదు లోడ్ల వరి కసువు (గడ్డి)ను తెచ్చి భద్రపరుచుకున్నారు.
ఇందులో ఇప్పటికే రెండు లోడ్ల గడ్డిని ఆవుల మేత కోసం ఉపయోగించగా, మిగిలిన నాలుగు లోడ్ల వరి గడ్డి మేటలు అలాగే ఉన్నాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఎవరో బీడీ తాగే వ్యక్తులు చెరువు వైపు వెళుతుండగా బీడీని ఆర్పకుండా పారేశారు. ఈ నిప్పు పడి ఆ వరి గడ్డి నిప్పు అంటుకుంది. అగ్నికీలలు ఎగసిపడి మూడు లోడ్ల వరి గడ్డి పూర్తిగా కాలి బూడిదైంది.
పాడి ఆవుల ఆకలి తీర్చేందుకు ఎంతో శ్రమకోర్చి తెచ్చుకున్న పశువుల మేత బూడిద కావడంతో రైతు సుబ్రహ్మణ్యం తీవ్రంగా కలత చెందారు. రూ.60 వేలు నష్టం వాటిల్లిందని, ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు పోలీసులను, స్థానిక అధికారులను కోరుతున్నారు.

