మదనపల్లె, సెప్టెంబర్ 10:
2026: మదనపల్లెలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కోసం అంతర్గత హ్యాకథాన్ కార్యక్రమం ప్రారంభించారు.
విద్యార్థులలో వినూత్న ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడం, వాస్తవ ప్రపంచ సమస్యలను గుర్తించడం మరియు సమాజ, దేశాభివృద్ధికి దోహదపడే ఆచరణాత్మక సాంకేతిక పరిష్కారాలను రూపొందించేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని కళాశాల డైరెక్టర్ రామలింగారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆర్. రామమోహన్ రెడ్డి, అధ్యక్షుడు ఎం. నాగమల్ల రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
